
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జులై 21
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా చింతూరు మండలం చట్టి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పొడియం లక్ష్మణ్ ఐద్వా మండల అధ్యక్షురాలు మడివి శ్రీదేవి మీరు మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లకు హెల్పర్లకు మినీ వర్కర్లకు గర్భిణీలు బాలింతలు పిల్లలకు పేస్ యాప్ రద్దు చేయాలి. సెంటర్ కు నిర్వహణకు ఒక యాప్ మాత్రమే నిర్వహించాలని అన్ని రాష్ట్రవ్యాప్తంగా ఐసిడిఎస్ లక్ష్యం పేద గర్భిణీలను బాలింతలు చిన్న పిల్లలకు ఆహారం ఆరోగ్యం విద్య అందించాలి. పోషణ ట్రాకర్ యాప్ బాల సంజీవన యాప్ తీసుకొచ్చి లబ్ధిదారుల ఆహారం ఓటీపీ ద్వారా ఈ కేవైసీ చేసి ఫోటో క్యాచర్ చేస్తేనే సరుకులు ఇవ్వాలని పెట్టి నిబంధనలను తొలగించాలని. గతంలో వల్లే లబ్ధిదారులకు సంతకాలు పెట్టించుకొని సరుకులు ఇవ్వాలని కోరుతూ అలానే నాణ్యమైన సెల్ ఫోన్లు. టిఎడిఎ బిల్లులు. బిల్లులు ఇవ్వాలని అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రానికి ఇన్చార్జి సిడిపిఓ కి ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి నూక రత్నం. సెక్టర్ లీడర్లు వసంత. స్వరూప. దుర్గ. పార్వతి. కిట్టమ్మ. లబ్ధిదారులు. తదితరులు పాల్గొన్నారు