
శేరిలింగంపల్లి, జనవరి 11 పయనించే
సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)
మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలే పండుగలు. సంక్రాంతి పర్వది నాన్ని పురస్కారించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండే షన్ సంయుక్త ఆధ్వర్యంలో శేరిలింగం పల్లి జంట సర్కిళ్ళ పరిధిలో గల 35 కాలనీల లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వ హించడం జరుగు తుంది. ప్రతి కాల నీలో పోటీలలో గెలుపొందిన వారికి ప్రథ మ,ద్వితీయ,తృతీయ 5 ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగు తుంది.దీనిలో భాగంగా ఈరోజు శేరిలిం గంపల్లి డివిజన్ పరిధిలో గల బాపునగర్ నందు మహిళలకు ము గ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షులు కొమి రిశెట్టి సాయిబాబా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసో సియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామ స్వామి యాదవులు మాట్లాడుతూ పరిశుభ్రత,ఆరోగ్యం,అలంకరణల మేళ వింపే ముగ్గులు”అన్నారు.ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక
శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుం ది.పట్టణీకరణ నేపథ్యంలో అపార్టు మెంట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి,సంప్రదాయాలు నానాటికి కనుమరుగవుతున్నాయి.నేటి యువతరం మన ప్రాచీన సంస్కృతి,సం ప్ర దాయాలు కొనసాగించేందుకై ఈ పోటీ లు నిర్వహిస్తున్నాము”అని అన్నారు.ఈ ముగ్గుల వలన పరిసరాలు పరిశుభ్రతగా ఉంటాయి.గో మయంతో కళ్ళాపి జల్లి బియ్యపు పిండి తో ముగ్గులు వేయడం వలన బియ్యపు పిండి తినడానికి చీమ లు చేరతాయి. ఆ విధంగా చీమలు క్రిమ కీటకాదులు ఇంటి లోనికి రాకుండా అడ్డు కుంటాయి.ఈ ము గ్గులు వేసే ప్రక్రియలో మహిళలు అనేక శరీర భంగిమలలో పనిచేయవలసి ఉటుంది.ఈ వ్యాయామ ప్రక్రియ వలన మహి ళలలో అనేక గర్భ కోశ వ్యాధులు రాకుం డా ఉండేందుకు అవకాశం ఉందని వైద్యులు తెలిపా రు.కావున ప్రతి మహిళ కూడా ప్రత్యే
కించి ఈ ధనుర్మాసం మొత్తం నెలరోజు
లు అత్యంత ఉత్సాహంగా వేకువ ఝా మున లేచి ముగ్గులు వేయడం ప్రారంభి స్తారు”*అని అన్నారు.ఈ పోటీల లో 25 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్ర మంలో స్థానిక మహిళా నాయకురాలు తన్వీర్ బేగం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.