
పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 టేట్లపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి ట్రై కార్ రుణాలు 2019. 2021 సంవత్సరంలో మంజూరై చెక్కులు సిద్ధం చేసి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడని లబ్ధిదారులు అందరూ తరలి రావాలని గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూగులోత్ రామ్ చందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ ఏప్రిల్ 7న చలో గిరిజన సంక్షేమ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలియజేశారు. రాజీవ్ యువ వికాసం పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించడం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని గత ప్రభుత్వం ట్రై కార్ సంస్థ ద్వారా 2019. 2021 సంవత్సరంలో గిరిజన యువతి యువకుల నుండి వేలాది దరఖాస్తులను తీసుకొని అందులోనుండి 30 వేల మందికి రుణాలను మంజూరు చేస్తూ లబ్ధిదారులుగా గుర్తించిందన్నారు. వీరి బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి 219 కోట్ల రూపాయల చెక్కులను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. 30 వేల మంది గిరిజన యువతీ యువకులకు రుణాలను మంజూరు చేసి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేయకుండా రద్దు చేయాలని కుట్రలు చేస్తుందని వారు ఆరోపించాయి.
రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయకుండానే హడావిడిగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టడం లబ్ధిదారులలో తీవ్ర ఆందోళన కలుగుతుందని అన్నారు. అందుకే ఏప్రిల్ 7న చలో గిరిజన సంక్షేమ భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రైకార్ లబ్ధిదారులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.