
కొడవటూరు దేవస్థానం లో జరిగే శివరాత్రి ఉత్సవాలకు బందోబస్తు గురించి అధికారులకు సూచనలు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12, బచ్చన్నపేట మండల ప్రతినిధి నీల పవన్. జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో ఇసుక నిల్వలకు తావు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరగకుండా నిరోధించడానికి కరకట్టలు వేయించారు.అనంతరం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ స్వయంభు సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి పురస్కరించుకొని బందోబస్తు పై అధికారులకు సూచనలు చేశారు.ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూడాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించి నర్మెట్ట సర్కిల్లోని అందరు ఎస్ హెచ్ ఓ లకు సూచనలు ఆదేశాలు జారీ చేశారు వీరితోపాటు జనగామ ఏసిపి బండారి చేతన్ నితిన్,నర్మెట సీఐ ఏం అబ్బయ్య, బచ్చన్నపేట ఎస్సై ఎస్కే హమీద్ మరియు వివిధ మండలాల ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.