
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12, బచ్చన్నపేట మండల ప్రతినిధి నీల పవన్. బచ్చన్నపేట మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మట్టి బాలరాజు నియమించబడ్డారు. మంగళవారం జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన నూతన కమిటీ లో బాలరాజును మండల ఉపాధ్యక్షుడిగా నియమించారు. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లికి చెందిన మట్టి బాలరాజ్ మాట్లాడుతూ తనను మండల ఉపాధ్యక్షుడిగా నియమించిన బీసీసీ అధ్యక్షులు కొమ్మురి ప్రతాప్ రెడ్డకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మండల అధ్యక్షుడు బాల్రెడ్డి మరియు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తానని ఎల్లవేళలా కార్యకర్తలకు మండల నాయకులకు అందుబాటులో ఉంటూ వారికి అండదండగా ఉంటామని వారు అన్నారు.