Saturday, September 6, 2025
Homeఆంధ్రప్రదేశ్బడా నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలు ఎంకరోచ్మెంట్ జాబితాలో ఎందుకు గుర్తించలేదు

బడా నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలు ఎంకరోచ్మెంట్ జాబితాలో ఎందుకు గుర్తించలేదు

Listen to this article

అన్ని రకాల నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలను గుర్తించి తక్షణమే కూల్చి వెయ్యకపోతే ఉద్యమ ఉధృతం చేస్తాం.

ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుజ శ్రీను

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 6

శనివారం నాడు గంగవరం మండలం రాజవరం గ్రామంలో ఆదివాసి సంక్షేమ(274/16)పరిషత్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ వారే ఇప్పుడు అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియను మర్చిపోయారని ఆయన విమర్శించారు. గంగవరం మండల పరిధిలోని అక్రమ కట్టడాల జాబితా ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా కోరగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం ఆశ్చర్యంగా ఉందని, స్థానిక ఆదివాసీలు మరియు రాజకీయం చేయలేని నోరు తెరిచి అడగలేని చిన్నచిన్న నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాల జాబితా మాత్రమే రూపొందించారని అసలైన నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలు మాత్రం ఎంక్రోచ్మెంట్ లిస్టులో గుర్తించలేదని దీని వెనకున్న పరమార్థం ఏంటో చెప్పాలని ఆయన రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అక్రమ కట్టడాలు ఎవరు కట్టిన ఆదివాసి సంక్షేమ పరిషత్తు వదిలిపెట్టదని కానీ నాన్ ట్రైబల్స్ పక్షపాతి గా వ్యవహరిస్తూ అసలైనటువంటి అక్రమ కట్టడాలను గుర్తించకపోవడం వెనక ఆంతర్యమేంటో తెలియజేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ మరియు న్యాయస్థానాలు ఉత్తర్వులు మేరకు అల్లూరి జిల్లాలోని అక్రమ కట్టడాలు గుర్తించి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గారే ఇప్పుడు అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియపై నోరు మెదపడటం లేదని దీన్ని అదునుగా చేసుకున్న రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా అక్రమ కట్టడాలను గుర్తించి బడ నాన్ ట్రైబల్స్ నుంచి ముడుపులు తీసుకొని వాళ్లని అక్రమ కట్టడాల జాబితాలో గుర్తించలేదని ఆయన విమర్శించారు. కనీసం నోటీసులు ఇచ్చిన అక్రమ కట్టడాలను కూడా కూల్చకుండా అధికారులు ఎందుకు కాలయాపన చేస్తున్నారు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కొన్ని పంచాయతీ పరిధిలో అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ ఎటువంటి అక్రమ కట్టడం లేనట్టుగా మరికొన్నిచోట్ల 50 నుంచి 100కు పైగా అక్రమ కట్టడాలు ఉన్నచోట కూడా ఒకటి రెండు అక్రమ కట్టడాలని గుర్తించినట్లు సమాచారము ద్వారా అడిగిన వివరాల్లో రెవెన్యూ అధికారులు పేర్కొన్నారని ఇది అత్యంత దుర్మార్గమైన విషయమని అన్నారు. సర్వేర్, పంచాయతీ, రెవెన్యూ అధికారులు నాన్ ట్రైబల్స్ తో కుమ్మక్కై తప్పుడు పద్ధతిలో అక్రమ కట్టడాలను గుర్తిస్తున్నారని అక్రమ కట్టడాలు గుర్తింపు విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. గతంలో జిఎం పాలెం పంచాయతీ నుంచి అక్రమ కట్టడాలు తొలగించాలని జాతీయ షెడ్యూల్ తెగల కమీషన్ కి ఫిర్యాదు చేసి ఉన్నామని, దీనికి సంబంధించి అల్లూరు జిల్లా కలెక్టర్ వారికి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కనీసం ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ గాని ఐటిడిఏ అధికారులు గాని స్థానిక రెవెన్యూ అధికారులు గానీ ఆ నోటీసులపై విచారణ జరిపిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య వైఖరులకి తప్పకుండా ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమం ద్వారా బుద్ధి చెబుతుందని ఆయన హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న అధికారులను మాత్రమే నియమించాలని, చట్టాలపై సరైన అవగాహన లేని అధికారుల వలన ఏజెన్సీ చట్టాలు నీరుగారి పోతున్నాయని, అంతేకాక ఏజెన్సీలోని నాన్ ట్రైబల్స్ తమకున్న డబ్బు, రాజకీయ పలుకుబడితో అధికారులను ఈజీగా తమ బుట్టలు వేసుకొని వారికి అనుకూలంగా పని చేయించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ కొనసాగింపు మొదలుపెట్టకపోతే ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ కోఆర్డినేటర్ పీట ప్రసాద్, మండల అధ్యక్షులు కంగల అబ్బాయి దొర, మండల నాయకులు చోడి ఏడుకొండల దొర, పండ రాంబాబు పీసా కమిటీ కార్యదర్శి, ముర్రం బుచ్చన్న దొర, కంగాల వెంకట్రావు, చవలం వెంకన్న దొర, చిన్నాల దొర, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments