
పయనించే సూర్యుడు న్యూస్ 26 మార్చ్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
నిజామాబాదు జిల్లా భీంగల్ మండలం లోని బడా భీంగల్ గ్రామంలో తేదీ 26.03.2025 నాడు ఉదయం అందాజా సమయం 0600 గం,, ప్రాంతంలో బడా భీంగల్ శివారులో కప్పల వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తునారు. అనే నమ్మదగిన సమాచారం మేరకు భీంగల్ పోలీస్ వారు అక్కడికి వెళ్ళగా పోలీసులను చూసి పారిపోతున ట్రాక్టర్లను ఎల్లమ్మ గుడి దగ్గర మొత్తం 4-ట్రాక్టర్లను పట్టుకొని వారి దగ్గర వివరాలు అడుగగా ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తునారని ట్రాక్టర్ లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి. అట్టి ట్రాక్టర్ డ్రైవర్లు 1) కిష్టమ సదానంద్ R/o బడ భీంగల్ 2) పెద్దోళ్ల శ్రీకాంత్ R/o బడ భీంగల్ 3) ఎత్తిని అజయ్ R/o బడ భీంగల్ 4) ఎల్దుర్తి కిషన్ R/o బడ భీంగల్ సాయంత్రం ఐదు గంటలకు మరో ట్రాక్టర్ పట్టుకున్నారు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనది. భీంగల్ మండలం లో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడును.
