
ఏపీఎంకె అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మెంతెన ప్రభాకర్
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 టేకులపల్లి ప్రతినిధి, (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుదాం 134వ జయంతిని డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ టేకులపల్లి మండల కేంద్రంలో జరుపుకుంటూ ప్రపంచ మేధావిని స్మరించుకోవడం జరిగింది
ఈ సందర్భంగా అంబేద్కర్ ఫూలే మాక్స్ కాన్సీరామ్ అధ్యయన వేదిక వ్యవస్థాపకులు మెంతన ప్రభాకర్,
తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షులు కుంజా రాఘవులు మాట్లాడుతూ….
నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్యను పూర్తిగా కాషాయకరించిందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని ప్రజా హక్కులను, చట్టాలను ఖూనీ చేసిందని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వరంగ సంస్థలను, బహుళ జాతి, కార్పోరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం కట్టబెట్టిందని అన్నారు. దేశభక్తి, హిందుత్వం ముసుగులో దేశ వనరులను, సహజ సంపదలను దళారులకు అమ్మి వేస్తుందని తెలిపారు. తాజాగా మోడీ ప్రభుత్వం కన్ను అడవులపై పడిందని, 2026 మార్చి 31 నాటికి అడవులను అదాని కి అప్పగించడం కోసం అత్యంత క్రూరంగా ఆపరేషన్ కగారు పేరుతో అడవిలో ఉన్న ఆదివాసీలను హాననం చేస్తుందని దుయ్యబట్టారు. లక్షల కోట్ల రూపాయలు కార్పోరేట్ సంస్థలకు రాయితీ ఇస్తూ, దేశ ప్రజలపై తీవ్రమైన పన్నుల భారాన్ని మోపుతున్నదని అన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, ప్రాచీన భారత రాజ్యాంగం పేరుతో మనుస్ృతిని తిరిగి తెరపై తీసుకురావడానికి, భారత రాజ్యాంగాన్ని బలహీన పరుస్తున్నదని తెలిపారు. ఈ విధానాలపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అందించిన స్ఫూర్తితో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ముక్తకంఠంతో నిరసించాలని, అగ్రకుల బ్రాహ్మణీయ, ఫాసిస్టు, మతోన్మాద విధానాల పట్ల ప్రజలు అప్రమత్తమై బిజెపి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టరూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకల సతీష్, కొంపటి జీవన్, ఇస్లావత్ కీమా, కండే నాగభూషణం, ఈసం కన్నయ్య, ఏనూటి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు