(సూర్యుడు సెప్టెంబర్ 30 రాజేష్)
ప్రకృతిని ఆరాధించి, దైవ సమేతంగా భావించే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం.
ఈ నేల మీద మొలిచే ప్రతి పువ్వుని తీర్చి దిద్ది గౌరమ్మకు రూపం దిద్ది జరుపుకునే పండుగ….బతుకమ్మ.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.
తొమ్మిది రోజులపాటు సాగే బతుకమ్మ పండుగకు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధించడం తరాల నాటి నుండి వస్తున్న మన తెలంగాణ సాంప్రదాయం.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం,ఆప్యాయతలు,భక్తి,భయం చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు.ఈ పండగ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాన్ని విరజల్లాలని అందరూ సుఖశాంతులతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ గౌరమ్మని వేడుకుంటూ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మను పేర్చి దుబ్బాక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ అక్క ఆధ్వర్యంలో ఆడపడుచులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.


