
పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ ఏప్రిల్ 15.నల్గొండ జిల్లా కేంద్రంలోని భారత రాజ్యంగా ప్రదాత భారత రత్న దర్శనికుడు నిత్య స్ఫూర్తి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి Dr బీమ్ రావ్ అంబేత్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచం లో గల 193 దేశాలు ముక్తా కంఠం తో ప్రపంచ మేధావిగా గురించిన వ్యక్తి ని ఈ మధ్య కాలంలో దేశానికి దిక్సూచి అయినా దేవాలయం లాంటి పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో అధికార మదం తో Dr BR అంబేత్కర్ ని అవమానించిన బీజేపీ ఎంపీ ని సంస్పెండ్ చేయకుండా, అంబేద్కర్ యొక్క ఆశయాలను బడుగు,బలహీన వర్గాల అభ్యునతి సాధించడం కొరకు రాజకీయ, ఆర్ధిక సుస్థిరత సాధించడం కొరకు పెట్టిన రిజర్వేషన్ల ను తుంగలో తొక్కే కుట్రలో భాగంగా దేశంలో గల 100 కు పైగా ప్రభుత్వ సంస్థ లను ప్రయివేట్ పరం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అంబేత్కర్ ని అవమాన పరుస్తూనే వున్నది,రానున్న రోజులలో అంబేత్కర్ యొక్క గొప్ప తనం గురించి, భారత రాజ్యాంగం గొప్ప తనం గురించి ప్రతి వ్యక్తి కి తెలిసేవిదంగా కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపడుతుందని అంబేద్కర్ వంటి మహనీయులను అవహేళన చేసి మాట్లాడినటువంటి వ్యక్తులను సహించబోదని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో నల్గొండ జిల్లా సేవాదళ్ వైస్ ప్రసిడెంట్ వాహిద్ హాలీ, ఇర్ఫాన్, జెనరల్ సెక్రటరీ అసిఫ్,సెక్రటరీ ఫారిద్, టౌన్ వైస్ ప్రసిడెంట్ వినయ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ సీనియర్ నాయకులు ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది