
పయనించే సూర్యుడు మే 26 పొనకంటి ఉపేందర్ రావు
ఇల్లందుమండలంలోని మాణిక్యారం నుండి బోయ తండా మీదుగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం గ్రామస్తులు ఎమ్మెల్యే కోరం కనకయ్య వినతి పత్రం అందజేశారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యాన్ని తొరత గతిన ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు… వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ, మండల రాము, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాస్, ఉలింగ సతీష్, హరినాథ్ బాబు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.