
//పయనించే సూర్యుడు// జులై 22//
నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గ బీఎస్పీ నూతన కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ తెలిపారు.సోమవారం మక్తల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులు,మరియు పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో ఆయన నూతన కమిటీని ప్రకటించారు.మక్తల్ నియోజకవర్గ ఇంచార్జీ గా పాలెం వెంకటయ్య,నియోజకవర్గ అధ్యక్షుడిగా కెవి నరసింహ ఉపాధ్యక్షునిగా పరుశురాం,ప్రధాన కార్యదర్శి గా మల్ రెడ్డి,కార్యదర్శిగా బస్వరాజ్,కోశాధికారిగా మల్లికార్జున్ లను ఎంపిక చేసినట్లు తెలిపారు.నియోజకవర్గంలో పార్టీ బలోపేతం,ప్రజా,సమస్యలు బహుజన వర్గాలను ఏకం చేసి బహుజనుల కు రాజ్యాధికారం కోసం పని చేయాలని నూతన కమిటీకి దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ జుట్ల నరేందర్,జిల్లా కార్యదర్శి బండారి చంద్ర శేఖర్, బీఎస్పీ నాయకులు అజయ్ కుమార్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
