
ఆయనేంచే సూర్యుడు బాపట్ల మార్చి 8:- రిపోర్టర్( కే శివకృష్ణ)
మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందారని, ఇంకా చెందాలినీ కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసు రావు అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలో ఉన్న మహిళా ప్రముఖులను రెడ్ క్రాస్ సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని కర్లపాలెం రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎం పరమానంద కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్లపాలెం ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు మహారాణులు అన్నారు. మరియు ఊయల ఊపిన చేతులు ప్రపంచాన్ని పాలించగలరు అని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక కర్లపాలెం తాసిల్దారు సుందరమ్మను, ఎంపీడీవో ఆఫీస్ సూపర్నెంట్ రజిని, మండల విద్యాశాఖ అధికారులు విజయని ఎంపీడీవో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ కళ్యాణినీ ఘనంగా సన్మానించారు.. మహిళను సన్మానిస్తున్న రెడ్ క్రాస్ సభ్యులు
