
(పయనించేసూర్యుడు అక్టోబర్ 22 రాజేష్)
మన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు సూరంపల్లి గ్రామంలో చామంతి రాజు వాళ్ళు కూతురు చామంతి శ్రీలేఖకు 9000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ బూతు అధ్యక్షులు తైల కుమార్, దుబ్బాక నియోజకవర్గ మంకీ బాత్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, గ్రామ తాజమాజీ ఉప సర్పంచ్ బొల్లం స్వామి అందజేయడం జరిగింది,ఎవరైనా పెద్ద పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ లో చూయించుకుని అడ్మిట్ అయి ఉంటే వారి యొక్క హాస్పిటల్ బిల్స్ మన సూరంపల్లి బీజేపీ కార్యకర్తలకు ఎవరికైనా ఇస్తే అట్టి బిల్స్ తీసుకుపోయి మన మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి ఆధ్వర్యం లో CMRF కి అప్లై చేసి చెక్ తీసుకొని మీకు అందజేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోడంగి రాజు, కడారి శంకర్,తలారి శ్రీకాంత్, కడారి పెద్దోళ్ల ఎల్లం, జంగపల్లి స్వామి గౌడ్, చామంతి స్వామి,కేసోల్ల నర్సింలు,కేసోల్ల కనకయ్య తదితరులు పాల్గొనడం జరిగింది