
ఆర్థిక సహాయం అందజేస్తున్న దృశ్యం..
రుద్రూర్, ఏప్రిల్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ గ్రామానికి చెందిన చింతల రాజు – చింతల రేణుక దపంతుల కూతురు మహాన్విత వయస్సు 2 సంవత్సరాలు కాన్సర్ వ్యాధితో 3 నెలలుగా బాధపడుతుండడంతో స్థానిక బీజేపీ నాయకుల ద్వారా విషయం తేలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గం బిజెపి నాయకులు ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్ 5,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. అలాగే కోనేరు ట్రస్ట్ ద్వారా తన నెలవారీ టాబ్లెట్స్ కు సహాయం అందిస్తానని వారి కుటుంబనికి భోరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, మండల సీనియర్ నాయకులు కటిక రామ్ రాజ్, మండల ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.