Friday, January 31, 2025
HomeUncategorizedబాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అండగా ఉంటారు : ఆదూరి విజయ్ కృష్ణ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అండగా ఉంటారు : ఆదూరి విజయ్ కృష్ణ

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 29

ఈ రోజు ఎమ్మెల్యే ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి ఆదేశాల మేరకు ఆదోని జలగర వీధిలోని సిలిండర్ పేలి దద్దమైన గుడిసెలను స్థానిక బిజెపి నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి సూచన మేరకు ఈ రోజు సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు, బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే తరపున పరామర్శించమని వారికి అత్యవసరంగా నిత్యవసర సరుకులను అందించమని అన్నారు. ఆదోని తాసిల్దార్ తో ఫోన్ ద్వారా మాట్లాడి బాధ్యత కుటుంబాలకు వీలైనంత త్వరగా నష్టపరిహారం లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే పార్థసారధి బాధిత కుటుంబాలకు వీలైనంత మేరకు మేలు జరిగే విధంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారని తెలిపారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తామని ఎమ్మెల్యే ఫోన్ ద్వారా తెలియజేశారని వివరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ నార్త్ అధ్యక్షులు మహాదేవ్, బిజెపి నాయకులు రమాకాంత్ శ్రీనివాస ఆచారి, వాల్మీకి సాయి ప్రసాద్, వీరేష్, మధు, అంజయ్, శ్రీకాంత్, కాశి, రాము, మణికంఠ, రత్న బాయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments