PS Telugu News
Epaper

బాపట్లలో విషాదం – రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ‌మృతి చెందిన  వారు కర్లపాలంకు చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజు గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కొడుకు పెళ్లి వేడుకలకు ముందు జరిగే సంగీత్‌లో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top