
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 15:- రిపోర్టర్ (కే శివ కృష్ణ )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు- 2025 ఏప్రిల్ 14 నుండి 20 వరకు.బాపట్ల అగ్నిమాపక కేంద్రంలో ప్రారంభించడమైనది. మొదటి రోజు సోమవారం బాపట్ల అగ్నిమాపక కేంద్రం లో నిర్వహించారు. మొదటిగా విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులు అర్పించు కార్యక్రమమునకు ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి సి. మాధవ నాయుడు,కేంద్రాధికారి వై. వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది నివాళులు అర్పించటమైనది. అనంతరం 134వ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భముగా ఆయన పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. తదుపరి అగ్నిప్రమాదములు జరగకుండా వాటి నివారణ జాగ్రత్తలు గురించి వాలు పోస్టర్స్ మరియు కరపత్రాలు జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి సి. మాధవ నాయుడు చేతులు మీదగా ఆవిష్కరణ చేయించటమైనది. ఈ కార్యక్రమములో బాపట్ల పరిధి లోని స్కూలు విద్యార్థినులు, ప్రజలు పాల్గొన్నారు. బాపట్ల అగ్నిమాపక కేంద్రం నందు గల సిబ్బంది అగ్ని ప్రమాదములను నివారించుటకు గల పరికరములు మరియు రెస్క్యూ పరికరములు వాటి పనితనములు గురించి తెలియపర్చినారు.బాపట్ల కేంద్రాధికారి వై. వెంకటేశ్వరరావు అగ్ని ప్రమాదములు ఏర్పడుటకు గల కారణములు మరియు వాటి నివారణ పద్ధతులు గురించి తెలియజేసారు.