
ఎంపిడిఓ శ్రీనివాసరావు
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 23:- రిపోర్టర్ (షేక్ కరిముల్లా ) కర్లపాలెం మండలం పెద్ద గొల్ల పాలెం పరిధిలోని యారంవారిపాలెం హబిడేషన్ పరిధిలో ఉన్నటువంటి రెండు చోట్ల జరుగుతున్న కరువు పనులు పరిశీలించిన కర్లపాలెం ఎంపీడీవో శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం పొలం పనులు లేకపోవడం వలన ఎంతోమంది కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు నెలకొంటున్నాయని ఇలాంటి వారికి జీవనోపాధిని కల్పించాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఎన్ ఆర్ జి ఎస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వారికి పని కల్పించే బాధ్యత మీపై ఉందని తెలియజేశారు. కరువు పనులు కల్పించి వారు వలస పోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.