
మహిళా లేకపోతే జన్మే లేదు
అడిషనల్ ఎస్పీ టి పి విఠలేశ్వర్
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 2 :-రిపోర్టర్ (కే. శివ కృష్ణ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలమేరకు మార్చి 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సూచనలమేరకు మేరకు బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో పట్టణ సీఐ రాంబాబు, ఎస్సై విజయ్ కుమార్, ఎస్సై చంద్రావతి పర్యవేక్షణలో శనివారం కాపు కల్యాణమండపం నందు హెల్త్ చెకప్, రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ ఎస్పీ టి పి విఠలేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ టి పి విఠలేశ్వర్ మాట్లాడుతూ…1909 సంవత్సరంలో అమెరికాలో 18,000 మంది స్త్రీ కార్మికులు సమాన హక్కులు కావాలని ఉద్యమం చేయడం జరిగింది. 1975 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మీ చదువు మిమ్మల్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉమేన్ హెల్ప్ డెస్క్ ప్రారంభించామని అన్నారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళా కానిస్టేబుల్స్, కళాశాల విద్యార్థినీలు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పలువురు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఏ ఆర్ డిఎస్పీ విజయ్ సారధి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ మౌనిక, బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ, ఏఆర్ సీఐ మౌలుద్దీన్,ఏఆర్ ఎస్ఐ శ్రావ్య, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బి ఎస్ నారాయణ బట్టు,సఖి ఓ ఎస్ సి ఉషా రాణి, సుకన్య కుమారి కేసు వర్కర్, బాబి సైకో సోషియల్ కౌన్సిలర్, శిరీష ప్యారా లీగల్ పర్సనల్ లాయర్,ఎ ఆర్ ఎస్సై సుధాకర్, మహిళా కానిస్టేబుల్స్ ఫుడ్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థినీలు, అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినిలు, బాపట్ల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు, ఆశ వర్కర్లు , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.