పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24
శుక్రవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు కోటం బాపనమ్మ @ కోసు బాపనమ్మ బంధువుల ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ నందు శాంతియుత నిరసన తెలియజేసి మాతా శిశు మరణాలకు కారుకులైన రంపచోడవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్లపై క్రిమినల్ కేసులు వేయాలని సరైన పరివేక్షణ చేయని వైద్య అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రాజెక్టు అధికారి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నరకానికి ద్వారంగా మారిపోయిందని మనసులు ప్రాణాలు కాపాడలేని హాస్పటల్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటని ఆయన మండిపడ్డారు. బాపనమ్మ మరియు తన బిడ్డ మృతి చెందటానికి ముమ్మాటికి ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, తప్పిదం, చేతగానితనమే అని ఆయన విమర్శించారు. ప్రభుత్వా ఆస్పత్రులపై సరైన దృష్టి పెట్టకపోవడం వలన అధికారులు వైద్యులచే సరిగ్గా పనులు చేయించలేకపోతున్నారని, ఉన్నతాధికారులు నిర్లక్ష్యం కారణంగా వైద్యులు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాపనమ్మ మరియు తన బిడ్డది ఏరియా ఆసుపత్రి డాక్టర్లు చేసిన హత్యగా ఆయన అభివర్ణించారు. సరైన డెలివరీ కూడా చేయలేని డాక్టర్ చదువులు ఎందుకని ఆయన మండిపడ్డారు. ఎప్పుడో ఒకసారి మాతా శిశు మరణాలు జరిగితే ఏదో కారణం అయి ఉండొచ్చు కానీ ఈ 2025 సంవత్సరంలో ప్రస్తుతము వరకు వరస మరణాలు సంభవించాయని గతంలో కూడా ఇదే మాదిరిగా ఎన్నో మాతా శిశు మరణాలు జరిగాయని, అప్పుడు కూడా ఐటిడిఏ అధికారులు,జిల్లా కలెక్టర్ సరైన చర్యలు తీసుకోలేదని ఉన్నతాధికారులు ఒక సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వైద్యులపై గాని వైద్యాధికారులు పై గాని కఠిన చర్యలు తీసుకుంటే ఆదివాసులకు ఇటువంటి గతి పట్టి ఉండేది కాదని రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వైద్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసే వరకు తమ ఉద్యమాన్ని ఆపబోయేది లేదని ఆయన హెచ్చరించారు. ఆదివాసి రిజర్వేషన్ తో గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ఇన్ని వరుసమరణాలు జరుగుతున్న మసిపూసి మారేడు కాయ చేస్తూ జనాల్ని మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని డబ్బాలు కొట్టుకోవటం సరిపోతుందని ఆదివాసులు మృతి చెందుతుంటే కనీసం కుటుంబాలను పరామర్శించి ఓదార్పు నిచ్చే మనసు కూడా లేకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అదే నాన్ ట్రైబల్స్ కు కాలు విరిగిన, కడుపు నొప్పి వచ్చిన వెంటనే వాళ్ళ ఇల్లల్లోకి చేరుకొని ఓదార్పులిస్తూ ప్రకటన చేసే ఎమ్మెల్యే కి ఆదివాసులు మరణాలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి ప్రజాప్రతినిధుల వల్లనే అధికారులకు, వైద్యులకు కొమ్ములు వస్తున్నాయని ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉంటే అధికార వ్యవస్థ సరిగ్గా ఉంటుందని ఆయన అన్నారు. బాపనమ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మాతా శిశు మరణాలకు కారుకులైన వారిని శిక్షించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని, గత అధికారులు లాగా హామీలు ఇచ్చి కంటి తుడుపు చర్యలతోటి ట్రాన్స్ఫర్ ల తోటి సరిపెట్టుకుంటే ఇక ఆ తర్వాత జరిగే ఉద్యమాలకు అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని కావున డాక్టర్లపై క్రిమినల్ కేసులు వేయాలని సరైన పర్యవేక్షణ చేయని ఉన్నతాధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ ఉపాధ్యక్షురాలు బోరగా ఎర్రమ్మ, డివిజన్ ప్రధాన కార్యదర్శి జోడి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ కోఆర్డినేటర్ పీట ప్రసాద్, కంగాల అబ్బాయి దొర, చోడి ఏడుకొండల రావు దొర, కలుముల ప్రసాద్, కారు అరుణ కుమారి, పొడియం అరుణ కుమారి, దుర్గాదేవి, దేవి శ్రీదేవి, మృతురాలి బంధువులు ప్రజలు పాల్గొన్నారు.


