
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 5 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ అధ్వర్యంలో స్థానిక జమ్మికుంట మండలంలోని కోరపల్లి రోడ్డులో గల మార్కెట్ కమాన్ దగ్గర ఏర్పాటు చేసిన భారత దేశ మాజీ ఉప ప్రధాని అయిన బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రాచపల్లి వంశీ, పులాల నరేష్, రాచపల్లి సాగర్ మాట్లాడుతూ…అన్ని వర్గాల ప్రజల కోసం భారతదేశంలోని ప్రజలకు కావాల్సిన సేవలను అందించారు అలాగే ప్రజలు ఆయన మార్గంలో నడిచి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉండాలని కోరారు. అలాగే జమ్మికుంట లోని కోరపల్లి రోడ్డు లోని వ్యవసాయ మార్కెట్ గల కామాన్ వద్ద మాజీ ఉప ప్రధాని అయిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితెల ప్రణవ్ బాబు ని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం,జిల్లా ప్రధాన కార్యదర్శి రాచపల్లి వంశీ, జిల్లా ఉపాధ్యక్షులు పులాల నరేష్, జిల్లా కార్యదర్శి సలిగంటి సతీష్, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు శనిగరపు తరుణ్, కుమార్, రాచపల్లి అశ్విన్, గరిగంటి శ్రీధర్ , కుక్కల రమేష్, గరిగంటి లింగమూర్తి, ముంజల రాజేష్, కొలిపాక శ్రీను, గరిగంటి వాసు, గరిగంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు