
పయనించే సూర్యుడు మార్చ్ 20 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ కు ఈ నెల 27 న జరగుతున్న ఎన్నికలలో భాగంగా న్యాయవాది జె.అఖిల రావు గురువారం రోజు సీనియర్ న్యాయవాదులు మరియు తన తోటి సహచర న్యాయవాదుల తో పాటు కలసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు జీపీ రాజేశ్వర్ రావు, నవనీత్ రావు, దండే శ్రీనివాస్ రావు, ప్రకాశ్ రావు,తాండ్రా రమేష్ గౌడ్, వినోద, ఆదిత్య, విష్ణువర్ధన్ రెడ్డి, రాధాకృష్ణ, యాదయ్య, రాజేశ్ తదితరులు పాల్గొనడం జరిగింది.