
పయనించే సూర్యుడు బాపట్ల మర్చి 1 :- రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,బాల్య మరియు కౌమర కార్మిక వ్యవస్థ చట్టం 2016 ప్రకారం 18 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న బాల బాలికలు ఎవరూ కూడా పని ప్రదేశాలలో ఉండకూడదని,అలా ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే వారిపై బాల కార్మిక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ జె.వెంకట మురళి తెలియజేశారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డి.వి శివప్రసాద్, బాపట్ల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీమతి సాయి జ్యోతి,సిఫార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్ బడుగు కిషోర్ పాల్గొన్నారు.