
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 23(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి శరన్నవరాత్రులలో భాగంగా రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం కన్నుల వైభవంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో హోమాధి కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా తెప్పించిన సన్నాయి వాయిద్యం భక్తి పాటలతో ఉదయాన్నే సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతఅభిషేకము గంగపూజ తో నూతన వస్త్రాల సమర్పణ మహా మంగళహారతి తీర్థ ప్రసాదాల పంపిణీ సాయంత్రం కుంకుమార్చన లలితా సహస్రనామావళి మణిద్వీప వర్ణన భక్తి పాటలతో భజన కార్యక్రమం పంచహారతులు మొదలైన కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం అంతా యాడికి పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
