
చదరంగం క్రీడా పోటీలలో న్యూ పవర్ కుంగ్ ఫు విద్యార్థులు
హర్షం వ్యక్తం చేసిన న్యూ పవర్ కుంగ్ ఫు మాస్టర్ అహ్మద్ ఖాన్( బ్రూస్ లీ )
( పయనించే సూర్యుడు జూన్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
బాల బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని, శరీరపరంగా కఠిన వ్యాయామం చేయడంలో కుంగ్ ఫు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని, బాల బాలికలు తమను తాము రక్షించుకోవడానికి కుంగ్ ఫు విద్య ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే మానసికపరంగా బాల బాలికలు ఎంతో ఎత్తుకు ఎదగడానికి చదరంగం క్రీడ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని, చదరంగం క్రీడ వలన బాల బాలికలలో మానసిక స్థైర్యం పెరిగి చదువులలో కూడా ముందుంటారని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ అన్నారు. తన మిత్రుడు షాద్ నగర్ అకాడమీ కోచ్, చదరంగం క్రీడా పోటీల నిర్వాహకుడు వానరసి జగన్ ఈరోజు నిర్వహించిన చదరంగం క్రీడా పోటీలలో పాల్గొన్న న్యూ పవర్ కుంగ్ ఫు విద్యార్థులు పాల్గొని మెడల్స్ సాధించడం పట్ల మాస్టర్ అహ్మద్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు.
