
పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఎల్కతుర్తిలో ఈ నెల ఇరవై ఎడవ తేదీ న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని వివేకానంద నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు జి. నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఓ సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగవైభవంగా రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు.కేసీఆర్‌ను చూడాలని, ఆయన మాట వినాలను ఈ నెల ఇరవై ఎడవ తారీకు కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దితే.కాం గ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దిగజార్చిందని విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ నుంచి రజతోత్సవ సభకు ప్రజలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.