
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి ఆగస్టు 6
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఎడుగురాలపల్లి పంచాయతీకి చెందిన బొడ్డుగూడెం అనే గ్రామానికి ఇదివరకు ఏ నెట్వర్క్ లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు అయితే కొన్నాళ్ల క్రితం ప్రైవేట్ నెట్వర్క్ వాళ్లు టవర్ వేయగా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ టవర్ ను కూడా నిలిపివేశారు. తర్వాత బొడ్డుగూడెంలో బిఎస్ఎన్ఎల్ 4g టవర్ ని ఏర్పాటుచేసి నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలవల్ల టవర్ నిర్మించిన ఆరు నెలల వరకు నెట్వర్క్ రాలేదు.గ్రామస్తులు సిగ్నెల్ లేక వైద్య సదుపాయం కోసం అంబులెన్సులను సంప్రదించే సదుపాయం లేక బందువులకు ముఖ్యమైన సమాచారం అందించలేక తీవ్ర అవస్తులు పడుతున్నమని సంబంధిత అధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తే చింతూరు బిఎస్ఎన్ఎల్ ఓ అండ్ ఎమ్ ఇంజనీర్ కాశి అతని టీం కలిసి నెట్వర్క్ రావడానికి కృషి చేయగా బొడ్డుగూడెం గ్రామంలో నెట్వర్క్ రావడంతో గ్రామస్తులు ఆనందంతో బొడ్డుగూడెం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుగా బిఎస్ఎన్ఎల్ జేటివో రవికి సమాచారమిచ్చి బిఎస్ఎన్ఎల్ ఓ అండ్ ఎమ్ ఇంజనీర్ కాశి ని మరియు బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ టీం టెక్నీషియన్స్ దుర్గ, రాము, పోసి సన్మానంచేసి ఇంజనీర్ కాశి గురించి గ్రామస్తులు మాట్లాడుతూ ఇంజనీర్ వారు ఎప్పుడు ఫోన్ చేసిన స్పందించి మా సమస్యలను పరిష్కరిస్తారని కొద్దీ రోజులు క్రితం టవర్ కేర్ టెకర్ విషయంలో స్థానికులను నియమించి గిరిజనలమైన మాకు సహయంగా ఉంటున్నారని వారికి పత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏడుగురాళ్లపల్లి పంచాయతీ కార్యదర్శితో పాటు ఉయిక బ్రహ్మయ్య, రవ్వ.జోగారావు, వెట్టి జోగయ్య, కణితి. శేఖర్, కణితి శివాజీ గ్రామ పెద్దలు మరియు సరియం చైతన్య, మడివి ప్రవీణ్, రవ్వ కోటేష్, మడివి రాజేష్,మీడియం సుధీర్ (యూత్ సలహాదారులు ) మరియు బొడ్డుగూడెం యూత్ మెంబెర్స్ పాల్గొన్నారు.
