
జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్న దృశ్యం..
రుద్రూర్, ఆగస్టు 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు బుధవారం ఇంటింటికి వెళ్లి జాతీయ జండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, ఉపాధ్యక్షులు భోజిగొండ అనిల్, జీలకర్ర విజయ్, కోశాధికారి కటిక రామ్ రాజ్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్, చిదుర మహిపాల్ సేటు, పార్వతీ మురళి, ఎర్రోళ్ల శ్రీనివాస్, నారోజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.