
బిజెపి పార్టీ కార్యాలయంలో ప్రమాద బీమా పాలసీ నిర్వహిస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఏప్రిల్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకాన్ని బిజెపి కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ అన్నారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ప్రమాద బీమా పాలసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ.. ఏవైనా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు, విద్యుత్ షాక్ కు గురైనప్పుడు ఈ ప్రమాద బీమా పాలసీ వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు హరికృష్ణ, ప్రశాంత్ గౌడ్, కటిక రామ్ రాజ్, ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్, శ్రీను స్వామి, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.