
- బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ..
రుద్రూర్, అక్టోబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆదేశానుసారం రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు శనివారం బంద్ పాటించి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత క్యాబినెట్లో ఎంతమంది మంత్రులకు బీసీ రిజర్వేషన్లు కల్పించిందని, అసలు బీసీ బిల్లు ఎక్కడ పాస్ కావాలి, బిల్లు ఎవరు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్లను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ నాటకాల్లో భాగంగా బందుకు కూడా కావాలనే పిలుపునిచ్చిందన్నారు. బిజెపి పార్టీ బీసీలకు ఎప్పుడు కూడా అండగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజెపి నాయకులు వడ్ల సాయినాథ్, పార్వతి మురళి, కటికే రామ్ రాజ్, శంకర్ పటేల్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.