
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు బనారం నర్సయ్య, కె. హనుమండ్లు, మాజీ ఉపసర్పంచ్ పత్తిమల బాలయ్య వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి మరో 50 మంది ఈరోజు సోమవారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాపాలనలో భాగస్వామ్యమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముత్యాల సునీల్ కుమార్ వారికి సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
