
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలిపిన సునీత
పయనించే సూర్యుడు బాపట్ల మే:-7 రిపోర్టర్ (కే శివకృష్ణ )
బి.యస్.ఎన్.ఎల్.అడ్వైజరీ కమిటీలో దళిత మహిళ సునీతకు చోటు దక్కింది. తన భర్త.., టీడీపీ నాయకుడు సౌందర్య రాజు సహకారంతో సామాజిక కార్యక్రమాలతో పాటు తెలుగు దేశం పార్టీ బలోపేతానికి అందించిన సేవలను గుర్తించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., సునీతకు టీ.ఏ.సీ.అడ్వైజరీ కమిటీలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ.., కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు లేఖ రాశారు. స్పందన కేంద్ర సమాచార, సాంకేతిక శాఖా మంత్రి జ్యోతిరాధిత్య సింథియా.. ఆమెకు బి.యస్.ఎన్.ఎల్.అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా పని చేసే అవకాశం కల్పిస్తూ .. ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సహకరించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావును మంగళ వారం చిత్తూరు ఎంపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన సునీత..,పుష్పగుచ్చాన్ని అందించి.., ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.