
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి,ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి
277,278,279,280,బూత్ లలో మాగంటి సునీతమ్మ గెలుపుకోసం ఎన్నికల ప్రచారం
( పయనించే సూర్యుడు నవంబర్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ తోనే హైదరాబాద్ నగర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారి గెలుపు కొరకు సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడలోని 277,278,279,280,బూత్ లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి.ఈ ప్రచారంలో మాజీ కార్పోరేటర్లు మహేష్ యాదవ్ శేఖర్,దేవేందర్ రెడ్డి,ప్రభుదాస్, బీఆర్ఎస్ నాయకులు మిట్టు, రామక్రిష్ణ,మాదేవ్ పూర్ రవీందర్ రెడ్డి,సత్య నారాయణ, హన్మంత్ రెడ్డి పురుషోత్తం రెడ్డి,భూత్ ఇన్చార్జులు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
