
బీజేపీ – ఒక ఉద్యమం నుండి, ఒక శక్తిగా మారిన విజయగాధ!-నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి
బీజేపీ అంటే అభివృద్ధికి మరో పేరు-అందే బాబయ్య
శ్రీరామనవమి రోజున బీజేపీ ఆవిర్భావ దినోత్సవం – ఇది యాదృచ్ఛికం కాదు, ఇది రాముడి సంకేతం! -విష్ణు వర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్‌నగర్ పట్టణంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు హరి భూషణ్ పటేల్ ఆధ్వర్యంలో 27, 11, 13, 14, 15,9 నంబర్ వార్డులలో బూత్ అధ్యక్షుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరణలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథితులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్న నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి,అందే బాబయ్య,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి,పాల్గొన్నారు శ్రీ వర్ధన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ: 1951లో భారతీయ జనసంఘ్ రూపంలో మొదలైన ఈ ఉద్యమం, 1980లో అధికారికంగా భారతీయ జనతా పార్టీగా (బీజేపీగా) మారింది.2 సీట్లతో మొదలైన ఈ ప్రయాణం, నేడు 20 రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిన పార్టీగా ఎదిగింది! ఇది నాయకుల పార్టీ కాదు… కార్యకర్తల పార్టీ!ఇది అధికారంలో ఉండే పార్టీ కాదు… దేశానికి సేవచేసే పార్టీ!ఈ పార్టీ క్రమశిక్షణ, త్యాగం, దేశభక్తి అనే మూలస్తంభాల మీద నిలబడింది.శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, అ తీసుకెళ్తూ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2047 కల్లా ‘వికసిత్ భారత్’ గా మన దేశాన్ని తీర్చిదిద్దడం మన లక్ష్యం!ప్రతి గ్రామంలో కమలం వికసించాలి!ప్రతి గుండెల్లో దేశభక్తి జ్వాల దహించాలి! ప్రతి బూత్ లో మన బీజేపీ జెండా ఎగురాలి! అందే బాబయ్య మాట్లాడుతూ “బీజేపీ ప్రభుత్వంలో పేదవాడి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వెలిగింది! వాడు ఇంతవరకూ కలలో కూడా ఊహించని సౌకర్యం ఇంటి చుట్టూ వచ్చి ఆగింది!“అన్నదాతకు పంటకే మద్దతు ధర వచ్చింది! రైతు కష్టానికి, భూమి తపనకు… నిజమైన విలువ వచ్చింది! “వాడు శ్రమించిన పనికి గౌరవం దక్కింది… వాడి నోటి మాటకు గుర్తింపు దక్కింది… ఆత్మగౌరవం, స్వాభిమానం నిలబడింది!బీజేపి ఎవరికైనా ఆపాదించిన పార్టీ కాదు! ప్రతి వర్గానికీ మైనారిటీ అయినా మెజారిటీ అయినా తలదాచుకునే మానవత్వం చూపిన పార్టీ! మతం, కులం, ప్రాంతం – ఇవన్నీ ఓ పక్కకు పెట్టి బీజేపీ ఓటమి కాదు – ఒప్పందం చేసింది దేశాభివృద్ధితో!వాగ్దానాల కోసం కాదు… జీవితాలు మార్చడానికే పీఎం కిసాన్ యోజన వచ్చింది రైతు ఖాతాలో నేరుగా డబ్బు వేసింది!”ఆయుష్మాన్ భారత్ పథకం… ఆరోగ్యం తలుపు తట్టనంతవరకూ… సామాన్యుడికి ఆదరణ ఇచ్చింది!ఉజ్వల యోజన ఇంధనం దూరం కాదు, ఇంటి గుమ్మం దాకా తీసుకొచ్చింది!ముద్రా పథకం ఒక్క పది రూపాయల కెపిటల్ లేక భవిష్యత్తు కలలే కలలు కాబడ్డ యువతకి…
ఓ కిందటి ధైర్యం అయింది! బీజేపీ కులాలు చూడదు! మతాలు చూడదు! వర్గాలు చూడదు! దేనికంటే ముందు చూస్తది ఈ దేశ భవిష్యత్తును! మా కళ్లకెదురుగా ఉన్నదీ ఒకటే లక్ష్యం –వికసిత భారత్!”ఇప్పుడు… ప్రతి ఓటరు ఒక్కసారి ఆలోచించాలి – దేశాన్ని గెలిపించాలంటే మనమే ముందుకు రావాలి!”ఒక్క ఓటు మేం వేసే ఓటే వికసిత భారత్‌కి ఓ బలం అవ్వాలి!!” ఇది మాట కాద ఇది ఒక నడిమిదారి ఈ రోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే – రామలక్ష్మణుల ఆశీస్సులతో, అయోధ్యలో శ్రీవరామ మందిరం నిర్మాణం తర్వాత తొలిసారిగా వచ్చిన శ్రీరామనవమి వేడుకలు… అదే రోజు బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవం కూడా జరగడం అనేది కేవలం సమయానుకూలత కాదు – అది భగవంతుని సంకేతం!ఈ రోజు శ్రీరాముడి ఆశీర్వాదం మన బీజేపీ పార్టీ మీద ఉందని నాకు పూర్ణ విశ్వాసం ఉంది. మన పండుగలు, మన పరంపర, మన ధర్మం – ఇవన్నీ బీజేపీ ద్వారా మరింత శక్తిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.ఇప్పుడే కాదు – బీజేపీ స్థాపన నుండి హిందూ ధర్మ రక్షణకే మేం నిలబడ్డాం. అయోధ్యలో శ్రీవరామ మందిర నిర్మాణం పోరాటానికి ప్రతిఫలం. ఇది కేవలం బిల్డింగ్ కాదు ప్రతి హిందువి గర్వం!ఈ రామనవమి రోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరగడం అన్నది మనకు ఒక సంకేతం – మన పథం సరిగానే ఉందని, మన పోరాటం ఫలిస్తోందని, మన గమ్యం సాధ్యం అవుతుందని! దేశం మొత్తం ఈ రోజు ఒకే గాత్రంతో గర్జిస్తోంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మనో రెడ్డి , బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి అశోక్ ప్యాట, యువ నాయకులు వంశీ , ప్రశాంత్ , సీనియర్ నాయకులు నందిగాం వెంకటేష్, శేరి విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ సింగ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ చారి , మట్టం ఋషికేశ్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి జంబుల నరసింహ , పట్టణ ఉపాధ్యక్షులు మల్చలం రాము గ, మంగ విజయ్ , శ్యామ్ సుందర్ , కాసోజు శివ, కుడుముల బాలరాజ్, కొంకల మణికంఠ , ఆనంద్ , బూత్ అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రవి, బాలకృష్ణ, రామ్ చందర్, కృష్ణారెడ్డి, రాజు,తదితరులు పాల్గొన్నారు