
పయనించే సూర్యుడు ఏప్రిల్ 02 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి రేగులతండా- దాసుతండ బీటీ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. ఏడాదిన్నర కాలంగా నిర్మాణంలో ఉన్న రేగులతండ-దాసుతండా బీటీ వేయాలని పలుమార్లు రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెడ్యా నాయక్, సొసైటీ డైరెక్టర్ బాలాజీ నాయక్, తండా నాయకులు పాల్గొన్నారు.