
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
. టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కే.రాజేశ్వర్ డి.
దేశాయ్ బీడీ ఫ్యాక్టరీకి చెందిన వేలాదిమంది కార్మికులను యజమాన్యం చేస్తూ నిలువు దోపిడిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీంగల్ మండల కేంద్రంలో దేశ బీడీ కార్మికులతో నిర్వహించడం జరిగింది… ఈ సందర్భంగా తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు. రాజేశ్వర్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమ.. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చట్ట విరుద్ధంగా దేశాయి బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం 1000 బీడీలకు పది రూపాయలు తక్కువ ఇవ్వడము (చట్టానికి దొరకకుండా) నిలువు దోపిడీ అవుతుందని తీవ్రంగా విమర్శించారు… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముడి సరుకు తుట్టిని (ఆకు తక్కువ పడితే కొనుగోలు చేసి బీడీలు ఇవ్వాలి.) కార్మికులు కొనుగోలు చేసి బీడీలు చేసి ఇవ్వాలి ఇది 100కు 100% కార్మిక చెట్టవ్యతిరేక చర్యఅవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. వీటితో పాటు బీడీ యజమాన్యం తినుబండారాలైన కురుకురే.. దీపావళి పండుగ సందర్భంగా స్వీట్లు.. కారా పాకెట్లు తప్పనిసరి కొనుగోలు చేసే విధంగా బలవంతంగా అంటకట్టే పద్ధతి సమంజసం కాదని ఈ పద్ధతి గత పది సంవత్సరాలుగా కొనసాగుతుందని కోట్లాది రూపాయలు కార్మికులకు నష్టం చేస్తున్నారని అన్నారు..అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల నష్టపరిచే ఈ పద్ధతుల్ని మానుకోవాలని కోరిన ఫలితం లేకపోవడంతో రేపు అనగా 16 అక్టోబర్ రోజున రేంజ్ ఆఫీసుకు వెళ్లి డిమాండ్ చేస్తామని అన్నారు.. దీనికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ పాత్రికేయ మిత్రులు సమావేశంలో… దేశాయి బీడీ కార్మికులు లావణ్య స్వప్న . రాజమణి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు…ఉద్యమ అభినందనలతో…