
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 ఎమ్మిగనూరు రిపోర్టర్ భాస్కర్
ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు సైడ్ పండ్ల వ్యాపారం చేసే సుభద్రమ్మకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి బీవీ. మోహన్ రెడ్డి జ్ఞాపకార్థంగా జీవన ఉపాధి కొరకు తోపుడు బండి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం బీవీ కుటుంబం ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలిపారు. పట్టణంలో వీధి వ్యాపారం చేసుకునే వారు ప్రశాంతంగా చేసుకోవాలని, ఎవరైనా ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి వారి ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.