
{పయనించే సూర్యుడు} {అక్టోబర్16}మక్తల్
బుధవారం ఉదయం పది గంటల ప్రాంతం లొ బీసీ బీసీల అఖిల పక్ష నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం లొ బుధవారం ఉదయం 29/10/2025 నాడు జరగబోయే చలో బీసీల గర్జన బీసీలకు 42% రిజర్వేషన్లకై రాయల్ ఫంక్షన్ హాల్ మక్తల్ లొ జరగబోయే సభకు పెద్ద ఎత్తున కదలి రావాలని అఖిలపక్ష నాయకులు పిలుపునివ్వడం జరిగింది మక్తల్ అసెంబ్లీ పరిధిలో ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి ఎద్దుల బండి కట్టుకొని పెద్ద ఎత్తున కదలి రావాలని అఖిలపక్ష నాయకులు పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో బీసీలపై రిజర్వేషన్లను సాధించుకోవాలి అని ఆత్మగౌరవం ఉన్న ప్రతి బీసీ బిడ్డలు అక్కలు రాజ్యకీయ మేధావులు బీసీ కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కదలి రావాలని బీసీలకు సరైన రిజర్వేషన్ లను సాధించుకొని ఆర్థికంగా రాజ్యాకీయంగా ఎదగాలి అని అన్నారు బీసీలకు ఇంత పెద్ద మొత్తంలో అన్యాయం జరుగుతుంది నేడు బీసీలము ఏకం కాకపోతే రాబోవు తరాలు చాలా దుర్భర జీవితాలు మనం చవిచుడవాల్సిన దుస్థితి దాపురిస్తుంది కావున ప్రతి ఒక్కరం చేయి చేయి కలుపుతూ “చలో బీసీల గర్జన సభను”విజయవంతం చేస్తారు అని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమం లొ కెవి నరసింహ ఓబ్లపూర్ తిమ్మప్ప ఉజ్జెల్లి బస్వారాజ్ హిందూపూర్ ఆంజనేయులు సత్యరం ఆంజనేయులు శివ లింగప్ప తదితరులు పాల్గొన్నారు
