బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా వేదికగా దీక్ష
నవంబర్ 4–8 వరకు రిలే నిరాహార దీక్షలు
బీసీ లకు 42% రిజర్వేషన్ డిమాండ్
బీజేపీ వైఖరిపై జేఏసీ విమర్శలు
ఉద్యమాన్ని గ్రామాల వరకు తీసుకెళ్లే నిర్ణయం
పయనించే సూర్యుడు, అక్టోబర్ 29( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే విద్యార్థి రిలే నిరాహార దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర మంత్రులు డాక్టర్ వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీర్ల ఐలయ్య సంయుక్తంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు తెలిపారు कि నవంబర్ 4 నుంచి 8 వరకు దీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బీసీ విద్యార్థి జేఏసీ కన్వీనర్ డాక్టర్ జంపాల రాజేష్, చైర్మన్ కే. సైదులు యాదవ్, వైస్ చైర్మన్ వెంకట్ తిమ్మనగరం నాయకత్వంలో ఈ దీక్షలు జరుగనున్నాయని పేర్కొన్నారు.నవంబర్ 4న దీక్ష ప్రారంభానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని, నవంబర్ 8న ఆర్ట్స్ కాలేజ్ వేదికగా రాష్ట్రంలోని బీసీ ఉద్యమకారులందరినీ సమీకరించనున్నట్లు తెలిపారు.బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ హక్కు అని, ఈ విషయంలో బీజేపీ పార్టీ మొండి వైఖరిని వదిలేయాలని, లేకపోతే ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్తారని జేఏసీ నేతలు హెచ్చరించారు.అలాగే నవంబర్ 8లోపు బీసీ లకు 42% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి విస్తరించనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు, బీసీ జేఏసీ నాయకులు, మరియు బీసీ విద్యార్థులు పాల్గొన్నారు.


