
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏర్గట్ల మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు
అసిస్టెంట్ కలెక్టర్ (స్తానిక సంస్థలు) నిజామాబాద్ మరియు రిటర్నింగ్ అధికారి, బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గము ఎర్గట్ల మండల కేంద్రములోని రైతు వేదికలో జరుగుతున్న బూతు స్తాయి అధికారుల ఎల్ ఓ ఎస్ ట్రైనింగ్ కార్యక్రమమును పరిశీలించినారు. ట్రైనింగ్ గురించి వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యమునకు ఎన్నికలు పెద్ద పండుగ లాంటివి, ఎన్నికలు నిర్వహించుటకు బూతు స్తాయి ఓటర్ లిస్టు అత్యంత కీలకమయినది. అంత కీలకమయిన ఓటర్ లిస్టు తయారు చేయు భాద్యత బి ఎల్ ఓ లకు ఉంటుంది, కాబట్టి అందరు బి ఎల్ ఓ లు ఇట్టి ట్రైనింగ్ లో మాస్టర్ ట్రై నర్లు చెప్పు విషయాలు అన్ని శ్రద్ధతో విని, తప్పులు లేని ఓటర్ లిస్ట్ ను తయారు చేయవలయును అని బి ఎల్ ఓ లకు సూచించినారు. చనిపోయిన ఎ ఒక్క వ్యక్తి కూడా ఓటర్ లిస్ట్లో ఉండకూడదు వారిని తొలగించాలని, 18 సం. లు నిండిన ప్రతి, యువతీ, యువకులను కొత్తగా నమోదు చేయాలని. పేర్లు, ఇంటిపేర్లు, ఇంటి నెంబర్ లు సవరణలు ఉంటె చేయాలని, సూచించినారు. తప్పులు లేని ఓటర్ లిస్ట్ ను తయారు చేయవలయును అని ఎల్ ఓ లకు సూచించినారు. ఇట్టి కార్యక్రమములో తహసీల్దార్ మల్లయ్య, మాస్టర్ ట్రై నర్లు జి. రవి, జే. ప్రవీణ్ , సీనియర్ అసిస్టెంట్ కిరణ్, మండల రెవిన్యూ పరిశీలకులు సదానందం, రవిదాస్, కంప్యూటర్ ఆపరేటర్ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.