
( పయనించే సూర్యుడు అక్టోబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగా రెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో బూర్గుల గ్రామంలో ఉన్న అంగన్వాడి స్కూలులో అంగన్వాడి టీచర్ శ్రీలత ఏర్పాటుచేసిన పోషణ్ అభియాన్ కార్యక్రమమునకు , ప్రక్కలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్ శ్రీలత మాట్లాడుతు అంగన్వాడి స్కూల్ వచ్చిన బాలింతలకు మరియు గర్భవతులకు పోషకాహారం యొక్క ఉపయోగాలు గురించి తెలియజేశారు.పోషకాహారము మానవ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందని ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఇది శక్తి స్థాయిలను పెంచుతుందని, బరువు నియంత్రణకు సహాయం చేస్తుందని, మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని, పోషకాహారం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని , జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని,ఈ పోషకాహారం చర్మం, జుట్టు మరియు ఆకృతిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని అంగన్వాడి టీచర్ శ్రీలత తెలియజేశారు. అందువలన అందరూ స్త్రీలు సమతుల ఆహారాన్ని తీసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మమత మౌనిక అరుణ స్వప్న మనిషా స్వాతి తదితరులు పాల్గొన్నారు..