

మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామానికి చెందిన బూర్గుల సుమన మరణం బూర్గుల గ్రామానికి తీరని లోటని ఆమె సేవలు మరువలేనివి అని ఫరూక్ నగర్ మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ అన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నిత్యం తాపత్రేయ పడే సుమన లేరనే వార్త జీర్ణించుకోలేకున్నామని, ఆమె సేవలు తరతరాలకు గుర్తుంటాయన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజా సేవే మార్గంగా జీవించి , మరణించిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగ పడాలని తన శరీరాన్ని కోడా హాస్పాత్రికి వీలు రాసిన మహోన్నతి వ్యక్తి సుమన అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.