Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్బెట్టింగ్ యాప్ లపై దూకుడు పెంచిన పోలీసులు

బెట్టింగ్ యాప్ లపై దూకుడు పెంచిన పోలీసులు

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్‌ యాప్‌ కేసులు సీఐడీకి బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌పై కేసు నమోదు చేశాక.. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలోని ఠాణాలకు ఇదే అంశంపై ఫిర్యాదులు హోరె త్తుతున్నాయి. మియాపూర్‌ పోలీసులు కూడా మరో కేసులో దర్యాప్తు ప్రారంభిం చడంతో.. ఈ కేసులన్నింటి నీ సీఐడీకి బదిలీ చేయా లని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహ కులు చాలా మంది విదేశీ యులే చైనా కంపెనీల ప్రమేయం కూడా బయట పడుతోంది. నిర్వాహకులు రూ.వేల కోట్లను దేశం దాటించారు. యాప్స్‌ ప్రమోటర్లు సెలబ్రిటీలు ఇన్‌ఫ్లూయెన్సర్లు యూట్యూబర్లకు హవాలా మార్గాల్లో రెమ్యూనరేషన్‌ చెల్లించారనే ఆరోపణలు న్నాయి. దీంతో.. మనీలాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ అధికారు లు, సైబర్‌క్రైమ్‌ కోణంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సీఎ్సబీ ఇప్పటికే రంగం లోకి దిగగా ప్రభుత్వం అన్ని కేసులను కలిపి రాష్ట్ర స్థాయి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీఐడీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మియాపూర్‌ పోలీసులు నమోదు చేసిన బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో పలువురు దిగ్గజ సినీ నటులు ఇబ్బం దులను ఎదుర్కొనే సూచ నలు కనిపిస్తున్నాయి. 19 బెట్టింగ్‌ యాప్స్‌నకు సంబంధించిన ఇరవై ఐదు మంది నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచగా సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌, క్రైమ్స్‌ డీసీపీలు పక్కా ఆధారాలపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. ‘‘తొందరపాటుతో చార్జ్‌షీట్‌ వేయొద్దు. కేసు నీరుకారకుండా పక్కా ఆధారాలను సేకరించి, పకడ్బందీగా ముందుకు సాగాలి అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి అని సూచించినట్లు సమాచారం. దీంతో దర్యాప్తు అధి కారులు ఏయే యాప్‌లను ఎవరెవరు ప్రమోట్‌ చేశారు అందుకోసం వారికి దక్కిన ప్రతిఫలం ఎంత? అగ్రిమెంట్‌ వివరాలేంటి అనే కోణంపై దృష్టిసారిం చారు. ఇప్పటి వరకు జంగిల్‌ రమ్మీ అనే యాప్‌ను రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్‌ ప్రమోట్‌ చేశారని, ఏ23 యాప్‌నకు విజయ్‌ దేవరకొండ, యోలో 24/7 యాప్‌ కోసం మంచు లక్ష్మి ప్రచారం కల్పించారని నిర్ధారించారు.
19 యాప్‌లకు సంబం ధించిన సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత.. నిర్వా హకులు, ప్రమోటర్లను గుర్తించి, వారికి నోటీసు లిచ్చి, విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments