Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్బెల్ట్ షాపులజోరు పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

బెల్ట్ షాపులజోరు పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

Listen to this article

24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో అనారోగ్యానికి గురి అవుతున్న యువత

పయనించే సూర్యుడు మార్చి 7 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)

టేకులపల్లి మండలం లో జోరుగా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రమత్తులో ఉండి పర్యవేక్షణ కరువైందని తెలిసినా తెలియనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెల్ట్ షాపులతో పాటు కొన్ని కిరణా షాప్ లో సైతం మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. మద్యం సీసాల పై మద్దతు ధర కంటే ఒక్కొక్క బాటిలైపై పడే రూపాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా బెల్ట్ షాప్ లో మద్యం బాటిళ్లపై ఉన్న ధర కంటే ఎక్కువ ధర తీసుకుంటూ వాటర్ ప్యాకెట్లకు గ్లాసులకు అధిక డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మద్యం ఒక్కొక్క బాటలపై 20 రూపాయలకు పైగా అధికంగా తీసుకుంటుండగా రూపాయి గ్లాసులు ఐదు రూపాయలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్న ఎక్సైజ్ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులుకానీ సంబంధిత అధికారులు కానీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వైన్స్ నిర్వాహకుల అండదండలతో బెల్టు షాపులు కొనసాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపుల వారి నుండి ఒక్కొక్క బాటల్ పై అధిక ధరకు ఇస్తూ బెల్టు షాపుల వారు మద్యం ప్రియుల వద్ద అధిక ధరలకు ఇస్తూ విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలాగే బెల్ట్ షాపులలో మద్యం విక్రయాల జోరుగా సాగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం పోవడంలో అంతర్యం ఏమిటని ప్రతి నెల సంబంధిత అధికారులకు వైన్స్ నిర్వాహకులు మామూలు మాట్లాడుకుని బెల్టుషాపుల నిర్వాకం కొనసాగిస్తున్నారని విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెట్టు షాపులు అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగుతున్న అధికారులు నిమ్మకు నీరే తిన్నట్లు వ్యవహరించడంతో బెల్ట్షాపుల వ్యాపారం ఏదేచ్చగా దోపిడి కొనసాగుతుందని కొందరు మద్యం ప్రియులు పేర్కొంటున్నారు. నిబంధనలకు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులే బెల్టు షాపుల్లో అక్రమ మద్యం విక్రయాలు కొనసాగుతున్న పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి అధికారులు మామూలు తీసుకుంటూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెల్టు షాపుల దోపిడీపై గతంలో ప్రజాసంఘాల నాయకులు గిరిజన సంఘాలు మహిళా సంఘాలు సంబంధిత అధికారులకు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. నియంత్రణ లేని మద్యం వల్ల యువత అనారోగ్యానికి గురై మంచాన పడుతున్నారు
వైన్స్ నిర్వాహకులు మాత్రం తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి పెట్టు పెట్టిన డబ్బులను పై ఫోకస్ పెడుతూ అధిక డబ్బులు సంపాదించే విధంగా అధికారులతో నెల నెల మామూలు మాట్లాడుకొని బెల్టు షాపులకుప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఇలాగే అధికారులు వ్యవహరిస్తేనిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్టుషాపుల వ్యాపారం వల్ల మద్యం ప్రియులకు దోపిడి నుండి గురి తప్పక పోదని కొందరు మద్యం ప్రియులు పేర్కొంటు న్నారు.మద్యానికి అలవాటైన వారు అధిక ధరలైన పట్టించుకోకుండా ఎక్కువ ధరలకు కూడా బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తూ మద్యం సేవిస్తున్నారని అధికారులే పట్టించుకోక పోవడంతో రాజకీయనాయకులు సైతం అంతగా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు నిబంధన విరుద్దంగా మద్యం విక్రయించిన నాటుసార తయారు చేసిన చర్యలు తీసుకోవాల్సి బాధ్యత ఉండగా వారు బెల్ట్ షాపులపై దృష్టి పెట్టకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అధికారులు మామూలు తీసుకొని వ్యవహరిస్తున్నారని మండల ప్రజల నోట విమర్శలు కూడా వస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments