Sunday, October 19, 2025
Homeఆంధ్రప్రదేశ్బెస్ట్ టీచర్స్ అవార్డులను ప్రధానం చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్"

బెస్ట్ టీచర్స్ అవార్డులను ప్రధానం చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్”

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

ఆంధ్రప్రదేశ్ ప్రయివేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , అపుస్మా చైర్మన్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు . ఈ కార్యక్రమానికి అపుస్మా నంద్యాల జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రదానం చేస్తుందని దాన్ని ఆధారంగా తీసుకొని ప్రవేట్ స్కూల్లో మంచి బోధన చేసే వారిని కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపుస్మా) వారు నిర్వహించిన ఈ అవార్డు కార్యక్రమం మంచి శుభపరిణామం అని అన్నారు. ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలని , జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పొందిన వారికి అభినందనలు తెలియజేశారు . వినూత్న బోధనా పద్ధతులలో , విద్యార్థుల వృద్ధికి అంకితభావం, క్లిష్ట పరిస్థితుల్లోనూ అభ్యాస విజయాలను పెంపొందడంలో , స్ఫూర్తిదాయకమైన బోధన వంటి విషయాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపుస్మా వారి బెస్ట్ టీచర్స్ అవార్డుల ప్రదానోత్సవంలో గుర్తింపు దక్కిందన్నారు . ఉపాధ్యాయులకు ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొని రావాలని వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని తెలియజేశారు . అనంతరం అపుస్మా బెస్ట్ టీచర్స్ అవార్డు లోగోను ఆవిష్కరించారు. అలాగే బెస్ట్ టీచర్స్ అవార్డు పొందిన వారిని మేమేంటోతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో అపుస్మా స్టేట్ ప్రెసిడెంట్ తులసి విష్ణు ప్రసాద్ , స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , అపుస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ & శాంతినికేతన్ స్కూల్స్ అధినేత సుధాకర్ , రామకృష్ణ విద్య సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి , గురు రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత దస్తగిరి రెడ్డి , రావుస్ విద్యాసంస్థల అధినేత అప్పారావు , కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డి , వెంకటస్వామి , వికాస్ వలి , ఇషాక్ వలి , హుస్సేన్ భాష , ఉత్తేజ్ కుమార్ , హుస్సేన్ వలి , మోహిన్ మరియు భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments