
మాజీ సర్పంచ్ సాయిని రాఘవేందర్రావు. నర్సింహా పంతులు
( పయనించే సూర్యుడు అక్టోబర్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కేశంపేట్ మండలం బైర్కానపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మహేశ్వరం బస్ డిపో మేనేజర్ ను కలిసి బస్సు సౌకర్యంకల్పించాలని బైర్ఖాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాఘవేందర్ రావు, నరసింహా శర్మ పంతులు వినతి పత్రాన్ని అందజేశారు. ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు అఫ్జల్ గంజ్ నుండి బైర్కాన్ పల్లి మీదుగా నిడదవెల్లి గ్రామానికి బస్సు నడుస్తుందని అన్నారు. ఉదయం 9 గంటల సమయంలో అఫ్జల్ గంజ్ నుండి వయా నాగారం, కోళ్ల పడకల్ నుండి బైర్కాన్ పల్లి మీదుగా బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డి యం ను కోరారు.