
పయనించే సూర్యుడు ఆగస్టు 15 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: శుక్రవారం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందిటేకులపల్లి మండలం బోడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు బోడును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ బోడు యూత్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా బోడు యూత్ వారు కల్తి చంద్రశేఖర్, మాడె చంద్రశేఖర్, మేకల సతీష్, ఎట్టి ప్రశాంత్ నల్లభోతుల సతీష్ మాట్లాడుతూఅభివృద్ధికి నోచుకోని బోడు గ్రామ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు పరిపాలన సౌలభ్యం కోసం అధికార యంత్రాంగం అయినటువంటి తహసిల్దార్ కార్యాలయం, వ్యవసాయ శాఖ, ఆరోగ్యం కోసం ప్రభుత్వ హాస్పటల్, అందుబాటులో ఉండే అవకాశం కేవలం బోడును మండలం గా ప్రకటిస్తేనే తప్ప మరో ఏ విధంగాను సాధ్యపడదు ,బోడు పరిసర ప్రాంతాలు పూర్తిగా ఆదివాసి గిరిజన నివసించే ప్రాంతాలు వీటిని మండలాలుగా ప్రకటిస్తే ప్రజాభివృద్ధికి ఉపయోగపరంగా ఉంటుంది అన్ని అర్హతలు ఉన్నప్పటికీ బోడును మండలం గా ఏర్పాటు చేయకపోవడం సరైనది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బోడు కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న 12 గ్రామపంచాయతీల ప్రజల అభిప్రాయం మేరకు బోడు నీ మండలంగా ఏర్పాటు చేయాలి అని అన్నారు