
అభినందించిన కొందరు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో భాగంగా అవార్డు పొందడం జరిగింది.
మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ టీం ఆధ్వర్యంలో
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
విజయవాడ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి బోధిధర్మ అవార్డు కు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం న్యూ మాంక్స్ కుంగ్ పూ సీనియర్ మాస్టర్ తెలంగాణ నుండి బోధిధర్మ అవార్డు అవార్డుకు ఎంపికవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఒరిస్సా అనగా సౌత్ జోన్ మాస్టర్స్ అందరూ కలిసి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టీం అని ఒక అసోసియేషన్ నిర్వహించడం జరిగింది . ఈ అసోసియేషన్ లో సౌత్ జోన్ మాస్టర్స్ అందరూ నిర్ణయం మేరకు 40 మంది మాస్టర్ లకు మాత్రమే బోధిధర్మ అవార్డు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొందుర్గు నుండి జిల్లెల్ల రమేష్ మాస్టర్ ని ఎంపిక చేయడం జరిగింది.మార్షల్ ఆర్ట్స్ లో ఉచితంగా అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ యొక్క అవార్డు రావడం జరిగిందని సంతోషం వ్యక్తం చేసిన మాస్టర్ జిల్లెల్ల రమేష్ , ఇందుకు న్యూ మాంక్స్ కుంగ్ పూ సుప్రీం గ్రాండ్ మాస్టర్ ఆల్ ఇండియా ఎం రవి కుమార్ మాస్టర్ మరియు తెలంగాణ చీఫ్ ఇన్స్ట్రక్టర్ మాస్టర్ నక్క బాలరాజు మరియు రంగారెడ్డి జిల్లా న్యూ మాంక్స్ కుంగ్ పూ ప్రెసిడెంట్ మరియు కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ బోధిధర్మ అవార్డు దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు అని జిల్లెల్ల రమేష్ మాస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
