
మాజీ ఎంపీటీసీ జి.బలరాం రెడ్డి..
//పయనించే సూర్యుడు// జులై 6//మక్తల్
గత యాసంగి సీజన్ కు సంబంధించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మూడు నెలలు గడిచినప్పటికీ నేటికీ రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులను జమ చేయలేదని, తక్షణమే రైతుల ఖాతాల్లో నగదును జమ చేయాలని బిజెపి నాయకులు, మాజీ ఎంపీటీసీ జి.బలరాంరెడ్డి డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. రైతులకు మూడు విడతల రైతు భరోసాను ఎగ్గొట్టిన ప్రభుత్వం రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రైతుల ఖాతాల్లో ఒక విడత రైతు భరోసాను జమచేసి కంటి తుడుపు చర్యలకు దిగిందన్నారు. రైతు భరోసాతో ప్రలోభ పెట్టి రుణమాఫీ, వడ్ల బోనస్, యూరియా కొరత వంటి అంశాలను విస్మరించిందన్నారు. తక్షణమే ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీని చేయడంతో పాటు రైతులకు అవసరమైన యూరియాను పంపిణీ చేయాలన్నారు. లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు